The Christian Conclave
క్రిస్టియన్ కాంక్లేవ్ ఉద్దేశం ఏంటి? ఎందుకు?
మన దేశంలో, మరిముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ‘క్రైస్తవుడు’ అన్న పేరుకు అర్థం మారిపోయింది. క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ సాక్ష్యం, బహిరంగ క్రైస్తవ గుర్తింపు ప్రమాదంలో పడిపోయాయి. ఆదివారం చర్చిలలో కిటకిటలాడుతున్న జనం దేశంలో క్రైస్తవ ఉనికికి కొలబద్ద ఎప్పటికీ కాదు. బహిరంగ క్రైస్తవ గుర్తింపు లేకపోవడానికి పర్యవసానంగా ప్రస్తుత తరానికి, రానున్న తరాలకు అనేక కోణాలనుండి పెనుముప్పు పొంచి ఉంది. దినదినం అంతరించిపోతున్న క్రైస్తవుల సంఖ్య నేటికి 1% కు చేరింది. ‘క్రైస్తవులు’, ‘క్రైస్తవ’ మేధావులు ఈ విషయాల గురించి చర్చించుకోవాల్సిన సమయం వచ్చింది.
ఈ కాంక్లేవ్ ఎవరు నిర్వహిస్తున్నారు? ఎందుకు?
అంతరించిపోతున్న ఈ క్రిస్టియన్ సమాజం పట్ల భారం కలిగినవారు, రాబోవు పర్యవసానాలను గ్రహించగలిగినవారు, ప్రార్థనాపూర్వకంగా, ఏకమనస్సుతో, సంఘాలకు, వేదాంతాలకు, అతీతంగా కూడి, క్రైస్తవ సంఘసమాజాన్ని మేల్కొలుపు దిశగా నడిపించాలన్న ఉద్దేశంతో ఈ క్రిస్టియన్ కాంక్లేవ్ నిర్వహించడం జరుగుతోంది.
ఈ కాంక్లేవ్ లో ఏం చర్చిస్తారు?
పతనావస్థలో ఉన్న క్రైస్తవ సంఖ్యాశాతం, చర్చిలకు, బహిరంగ క్రైస్తవ గుర్తింపు లేని పాస్టర్లకు పొంచి ఉన్న ప్రమాదాలు, బహిరంగ గుర్తింపు విషయంలో దేవుని వాక్యం ఏం చెబుతోంది, బహిరంగ గుర్తింపు ఉన్నవారు అతి తక్కువ – లేనివారు ఎక్కువ ఉన్నకారణంగా క్రైస్తవ సమాజం ఎందుర్కొనబోయే సమస్యలు, దేశంలో వీస్తున్న క్రైస్తవ వ్యతిరేక పవనాలు, బహిరంగ గుర్తింపు లేమితో క్రైస్తవ సంఘంలో క్రైస్తవ కుటుంబాలలో ప్రవేశిస్తున్న లోకసంబంధమైన విలువలు సాంప్రదాయాలు, క్రైస్తవ గుర్తింపు లేమితో దేశ నిర్మాణంలో క్రైస్తవులకు దక్కని చోటు, హైందవ కులం నుంచి విడుదల పొందని క్రైస్తవ సంఘానికి రాని సంపూర్ణ విడుదల, ఇతర సంగతులను కూలంకషంగా చర్చించడం జరుగుతుంది.
What is the purpose of the Christian Conclave? Why is it being held?
In our country, and particularly in the Telugu states, the meaning of the word “Christian” has drastically changed. Christian faith, testimony, and open Christian identity are under threat. The bustling crowds in churches on Sundays cannot serve as a true indicator of Christianity’s presence in the nation. The absence of open Christian identity poses a significant threat to both the current and future generations from multiple perspectives. The percentage of Christians, which has been dwindling day by day, has now reached just 1%. It is time for “Christians” and “Christian intellectuals” to come together and discuss these critical matters.
Who is organizing this Conclave, and why?
This Christian Conclave is being organized by those who feel burdened about the dwindling Christian community, who understand the future consequences, and who prayerfully, with one mind, aim to transcend denominations and traditions to awaken and guide the Christian community toward a revival and greater awareness.